BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

పెనుగొలను హైస్కూల్లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 01:18 PM
180 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం వీరవనిత Rani Lakshmibai వర్ధంతి కార్యక్రమాన్ని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన పోరాటం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె పోషించిన కీలక పాత్రను విద్యార్థులకు వివరించారు.

విద్యార్థులు చిన్నప్పటి నుంచే దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి పరుచూరు హరిమాధవ గుప్త విద్యార్థుల యోగా కార్యక్రమాలకు ఉపయోగపడే టార్పాలిన్ షీట్లను పాఠశాలకు అందజేశారు. ఆయన సేవాభావాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.