BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 20 August 2026, 07:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను జెడ్పీ హైస్కూల్‌కు నీటి శుద్ధి యంత్రం వితరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 07:29 PM
132 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దాత నీటి శుద్ధి యంత్రాన్ని అందజేశారు.

గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామానికి చెందిన కీశే నంబూరి శేషగిరిరావు జ్ఞాపకార్థం ఆయన ధర్మపత్ని పద్మావతి రూ.20 వేల విలువైన నీటి శుద్ధి యంత్రాన్ని గురువారం పాఠశాలకు అందించారు. ఈ యంత్రం ద్వారా విద్యార్థులకు సురక్షితమైన, శుభ్రమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ తెలిపారు.

నీటి శుద్ధి యంత్రాన్ని పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు ఆదూరి ఆంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలకు అవసరమైన యంత్రాన్ని అందించిన దాత పద్మావతిని, అలాగే దాతను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు కె.వి. కృష్ణారావును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల దాత చూపిన శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నారు.