BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 22 August 2026, 12:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 12:27 PM
145 వీక్షణలు

పెనుగొలనులో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 99వ అంగన్వాడీ కేంద్రంలో శనివారం శిరిడి సాయి బాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామీణ కళలకు విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ చెక్కభజన, నాటక కళాకారుడు రాళ్లచర్ల జగన్నాథం, కోలాటం కళాకారుడు నాగరాజులను సాయి బాబా సేవా కమిటీ సభ్యులు నూతన వస్త్రాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

అనంతరం జరిగిన సభలో కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ.. తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలకు జానపద కళలే జీవనాడిగా నిలిచాయని అన్నారు. ఈ కళారూపాలను కాపాడుకోవడం ద్వారా మన వారసత్వానికి గౌరవం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. చెక్కభజన, కోలాటం, వీధి నాటకాలు, తోలుబొమ్మలాట, జానపద నృత్యాలు ప్రాంతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ కన్వీనర్ రంగు సత్యనారాయణ మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా జానపద కళారూపాలు గ్రామీణ ప్రజలను ఏకం చేసి సామాజిక ఐక్యతను పెంపొందించాయని తెలిపారు. రామాయణం, మహాభారతం వంటి పురాణ గాథలను సైతం చదువు లేని వారికి ఈ కళారూపాల ద్వారా చేరువ చేశాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బండారుపల్లి కృష్ణయ్య, ఓరుగంటి సురేష్, మహిళా కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు.