BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 28 June 2026, 03:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Obituary: పెనుగొలను గ్రామంలో విషాదం.. రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు దాములూరి రామలింగేశ్వర శర్మ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 03:43 PM
212 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను | NTODAY NEWS

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు దాములూరి రామలింగేశ్వర శర్మ (65) ఆదివారం ఉదయం కన్నుమూశారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఈ నెల 15వ తేదీన వాహనం నుంచి కిందపడటంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

రామలింగేశ్వర శర్మ భార్య ఏడాది క్రితమే మృతి చెందగా, ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆలయంలో అర్చకుడిగా సేవలందిస్తూ భక్తుల అభిమానాన్ని, గ్రామ ప్రజల గౌరవాన్ని సంపాదించుకున్నారు.

ఆయన మృతి పట్ల ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఆయన మరణంతో పెనుగొలను గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.