BREAKING
thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం
Date of Publish : 27 June 2026, 11:00 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:00 AM
203 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం జాతీయ గేయం "వందేమాతరం" రచయిత బంకించంద్ర ఛటర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, "వందేమాతరం" గేయం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాట యోధులకు స్ఫూర్తినిచ్చి, దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర జ్యోతిని వెలిగించిన సమర నినాదంగా నిలిచిందన్నారు.

బంకించంద్ర ఛటర్జీని బెంగాలీ సాహిత్య చరిత్రలో "సాహిత్య సామ్రాట్"గా కొనియాడుతారని, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో 13కు పైగా నవలలు, అనేక ధార్మిక గ్రంథాలు, వ్యాసాలను రచించి సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.

ప్రజల్లో జాతీయ చైతన్యం నింపేందుకు ఆయన రచించిన "ఆనందమఠం", "దుర్గేష్ నందిని", "కాపాల కుండల", "విషవృక్షము" వంటి రచనలు విశేష ఆదరణ పొందాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని బంకించంద్ర ఛటర్జీ సేవలను స్మరించుకున్నారు.