BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 23 August 2026, 08:17 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు.. నగర సంకీర్తనతో భక్తుల ప్రార్థనలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 08:17 AM
150 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను : వర్షాలు సమృద్ధిగా కురవాలని, చెరువులు నిండాలని కాంక్షిస్తూ పెనుగొలను గ్రామంలో ఆదివారం నగర సంకీర్తన నిర్వహించారు.

శివాలయం ప్రాంగణంలోని శిరిడి సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తన రేడియా రూము, వాటర్ ట్యాంక్ రోడ్డు, బస్టాండ్, బొడ్రాయి సెంటర్, రామాలయం మీదుగా కొనసాగింది. భక్తులు భగవన్నామ పారాయణం చేస్తూ గ్రామ ప్రధాన వీధుల్లో సంకీర్తన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, రాళ్లచర్ల జగన్నాథం, పాశం వెంకటేశ్వర్లు, వడ్డెరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అభయాంజనేయ స్వామి వద్ద హనుమాన్ చాలీసా పారాయణం

ఇదిలా ఉండగా శనివారం రాత్రి పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

కార్యక్రమ ఏర్పాట్లను నిర్వహణ కమిటీ సభ్యులు బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు పర్యవేక్షించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.