BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 05 June 2026, 08:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై CPI-ML లిబరేషన్ ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 08:57 PM
161 వీక్షణలు

రమణక్కపేట: CPI-ML లిబరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు ప్రకారం, అఖిల్ భారత ప్రగతీశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య, AICCTU నాయకులు పల్లి పాము భవాని, నంది పాము రాణి, నంది పాము నవ్య, నంది పాము చిట్టెమ్మ, నందిపాము రాహేలు, ఆముదాల రత్నం, ఆముదాల పండు, దా రా బేబీ శాలనీ, విజయలక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

వేముల బక్కయ్య మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. గత కొన్ని వారాలుగా కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్లో ఆందోళన కల్పించడం ద్వారా మైండ్ గేమ్ ఆడి రేట్ల పెంపుకు సిద్ధం చేయడం జరుగుతున్నది అని ఆయన అన్నారు.

అతను ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ, వారానికి ఒక రోజు మాత్రమే పెట్రోల్, డీజిల్ రేట్లపై “విశ్రాంతి” ఇవ్వడం, ప్రధాన మంత్రి మరియు ఇతర ప్రముఖుల కాన్వాయ్‌ల ఖర్చులు తగ్గించకపోవడం వంటి చర్యలు ప్రజలను తప్పుదారిలో నెట్టే ప్రయత్నమని పేర్కొన్నారు. VIP జీవన విధానాన్ని సవరించి సామాన్యులపై భారం తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రస్తుత మార్కెట్లో బంగారం ధరలు అత్యధికంగా ఉన్నాయని, పేద మరియు మధ్య తరగతి కుటుంబాలు బంగారం కొనడం కష్టమైపోయారని, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో రవాణా వ్యవస్థపై ప్రభావం పడడంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రజలను “నిత్యావసర సరుకులు కొనొద్దు” అంటూ పిలవడం అసమంజసమని అన్నారు.

వేముల బక్కయ్య చివరగా చెప్పారు, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించకపోతే ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని.