BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 26 April 2026, 06:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Apr, 2026 - 06:35 PM
183 వీక్షణలు

పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి సమీక్ష

ప్యానిక్ కొనుగోళ్లతో ఒక్కసారిగా 50 శాతంపైగా పెరిగిన డిమాండ్

రాష్ట్రంలోని 4,510 బంకుల్లో 10 శాతం బంకులు సరఫరా లేక మూతపడినట్లు తెలిపిన అధికారులు

ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

అమరావతి, ఏప్రిల్ 26:- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు.

రాష్ట్రంలో మొత్తం 4,510 అవుట్‌లెట్లు (పెట్రోల్ బంకులు) ఉండగా, పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడినట్లు అధికారులు తెలిపారు. సరఫరా గతం కంటే 10 శాతం పెరిగినా, ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9,048 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయి. అయితే, కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని చెప్పారు.

శనివారం రోజు 10,345 కిలో లీటర్ల పెట్రోల్, 14,156 కిలో లీటర్ల డీజిల్ అమ్మకం జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణ అమ్మకాలకు పోలిస్తే ఒక్కసారిగా 50 శాతం పెరిగిన అమ్మకాలు బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని తెలిపారు. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా సరఫరా పెరిగినా వినియోగదారులు బారులు తీయడం, కొనుగోలు కోసం ఇబ్బందులు పడటం కూడా observed అయ్యింది.

అతిగా కొనుగోలు చేస్తున్న ఆక్వా రంగం డ్రమ్‌లలో కొనుగోలు చేస్తూ, పెట్రో ఉత్పత్తుల విక్రయంలో సమస్యలు ఎదురవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, కలెక్టర్లు, ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారం పై సాయంత్రం లోపు నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.