BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 02 June 2026, 07:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 07:59 PM
221 వీక్షణలు

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం

ఏలూరు జిల్లా, ముసునూరు మండలం: ముసునూరు మండలం చింతలవల్లి శివారు కొత్తూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న గంగుల ఏలి బాబు పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు.

సమాచారం మేరకు, ఏలి బాబు గొర్రెలను మేపేందుకు పొలాలకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించాయి. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఏలి బాబు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అకాలంగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. స్థానికులు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.