BREAKING
తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొర్రూర్ పట్టణంలోని నూతనంగా శ్రీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం బీసీ డిగ్రీ కళాశాల ప్రవేశాలకు గడువు పొడిగింపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
www.ntodaynews.com

పింఛనులో కోత.. వృద్ధులకు గుండెకోత

జాతీయం
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
26 Mar, 2026 - 02:51 PM
360 వీక్షణలు

పింఛన్‌పై కత్తి – కేంద్రం కొత్త నిర్ణయం వివాదాస్పదం.?

– కె. వేణుగోపాల్ 98665 14577

‘పెన్షన్’ అనేది సాధారణంగా ఉద్యోగ జీవితాంతం శ్రమించిన వారికి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే సామాజిక భద్రతా పథకం. ఉద్యోగం నుంచి విరమణ తర్వాత ఆదాయం లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అందించే ఈ భృతి, శ్రేయోరాజ్యంలో ఒక కీలక బాధ్యతగా భావించబడుతుంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ ధృవీకరణ చట్టం–2025 ఈ భద్రతా వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2025-26 ఆర్థిక బిల్లులో భాగంగా 2025 మార్చి 25న పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టం ద్వారా పెన్షనర్లను రెండు వర్గాలుగా విభజించడం ప్రధాన అంశంగా మారింది. వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలులోకి వచ్చిన తేదీకి ముందు పదవీ విరమణ చేసినవారికి ఒక విధంగా, ఆ తర్వాత రిటైర్ అయినవారికి మరో విధంగా ప్రయోజనాలు కల్పించే విధానం ఇందులో ప్రతిపాదించబడింది. దీనివల్ల ఒకే విధంగా పనిచేసిన ఉద్యోగుల మధ్య అసమానతలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ చట్టం ప్రకారం, వేతన కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు మాత్రమే కొత్త ప్రయోజనాలు వర్తిస్తాయి. అంతకుముందు పదవీ విరమణ చేసిన వారికి ప్రస్తుతం ఉన్న పెన్షన్ మాత్రమే కొనసాగుతుంది. ఉదాహరణకు, 2026 జనవరి 1 నుంచి ఎనిమిదో వేతన సంఘం అమలులోకి వస్తే, ఆ తేదీ తర్వాత రిటైర్ అయినవారికే ఆ లాభాలు అందుతాయి. ముందుగా రిటైర్ అయిన లక్షలాది మంది పెన్షనర్లు ఈ ప్రయోజనాల నుంచి వంచించబడతారు.

ఇది కేవలం ఆర్థిక అంశమే కాదు, న్యాయపరమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. గతంలో సుప్రీంకోర్టు పింఛన్‌ను ‘డిఫర్డ్ వేజ్’గా పేర్కొంటూ, అది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేసింది. ముఖ్యంగా 1982లో వెలువడిన చారిత్రాత్మక తీర్పులో, పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షనర్లను వేరు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అయినప్పటికీ, తాజా చట్టం ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చరిత్రను పరిశీలిస్తే, 1979లో అమలు చేసిన సరళీకృత పెన్షన్ పథకం కూడా ఇలాంటి వివాదాలకు దారితీసింది. అప్పట్లో కూడా ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించి, ఆ తేదీకి ముందు రిటైర్ అయినవారిని ప్రయోజనాల నుంచి దూరం చేయడం తీవ్ర విమర్శలకు గురైంది. చివరకు పెన్షనర్లు న్యాయపోరాటం చేసి తమ హక్కులను సాధించుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మళ్లీ అదే దిశగా వెళ్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పెన్షన్ పెంపులు వృద్ధాప్యంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు, జీవన వ్యయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, పెన్షన్ సవరణలు అవసరమవుతాయి. అయితే కొత్త చట్టం ద్వారా ఈ పెంపులను పరిమితం చేయడం వృద్ధులపై అదనపు భారం మోపే ప్రమాదం ఉంది.

ఇక ఈ చట్టం ప్రభావం కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపైనా పడే అవకాశం ఉంది. దీనివల్ల దేశవ్యాప్తంగా పెన్షనర్లలో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు పెన్షనర్ల సంఘాలు, ముఖ్యంగా ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడానికి సిద్ధమయ్యాయి.

2026 మార్చి 25న జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించి, ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రాలు సమర్పించనున్నాయి. పెన్షన్ కోతలపై పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంఘటితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సంఘాలు పిలుపునిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, పెన్షన్ అనేది ప్రభుత్వ దయ కాదు, ఉద్యోగి సంపాదించిన హక్కు. ఈ హక్కును కాపాడడం ప్రభుత్వ బాధ్యత. తాజా చట్టం ఆ హక్కును పరిమితం చేసే విధంగా ఉంటే, అది వృద్ధుల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ఈ చట్టంపై పునరాలోచన చేసి, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అత్యవసరం.