BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 29 August 2025, 06:29 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

నాదెండ్ల పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ

తెలంగాణ
29 Aug, 2025 - 06:29 PM
389 వీక్షణలు
నాదెండ్ల పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ NTODAY NEWS:పల్నాడు జిల్లా శాంతిభద్రతల పరిరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణే ప్రథమంగా జిల్లాలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వర్తించాలి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్ ప్రాపర్టీ నేరాల నియంత్రణకు కృషి చేయాలి. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి. పెండింగ్ కేసులను తగ్గించాలని, దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ రికవరీపై దృష్టి సారించాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు మరింత చేరువ కావాలి అని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన పిటిషన్ లను త్వరితగతిన విచారించి పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, సిబ్బంది పనితీరును,మొత్తం రికార్డులను FIR ఇండెక్స్,కేసు డైరీలను, రిజిస్టర్ లను పరిశీలించారు.ఈ సంధర్భంగా యస్.పి చిలకలూరి పేట రూరల్ సర్కిల్ సిఐ కి మరియు నా దెండ్ల ఎస్సైకి పలు సూచనలు చేశారు. విచారణలో ఉన్న కేసుల యొక్క పురోగతి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నది మొదలగు అంశాలను గూర్చి క్షుణ్ణంగా పరిశీలించారు. దర్యాప్తులో ఉన్న కేసులలో సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని, తగిన సూచనలు సలహాలను చేశారు. పోలీస్ స్టేషన్ నందు CCTNS పనితీరు గురించి ఎస్సై ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విచారణ దశలో ఉన్న పోక్సో కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ కు గల కారణాలు తెలుసుకుని, వాటి విచారణ వేగవంతం చేయడానికి పలు సూచనలు చేసారు. రౌడీషీటర్ లపై నిరంతర ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ కేసుల సిడి ఫైల్స్ ను, ఇతర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసారు. పెండింగ్ లో ఉన్న కేసులను ప్రణాళికాబద్ధంగా త్వరితగతిన పూర్తిచేయాలని, ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విజబుల్ పోలీసింగ్ నిర్వహించి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా చూడాలని, సమస్యలు ఉండే ప్రదేశాలను గుర్తించి బీట్లను పెంచి గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక, గంజాయి మొదలైన నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, నిల్వలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ/వార్డు సచివాలయాల పోలీసుల సహకారంతో మహిళలపై జరుగుతున్న నేరాల అరికట్టడంపై దృష్టి పెట్టి, వాటిని అరికట్టాలని తెలిపారు.అంతే కాకుండా సైబర్ నేరాలు,ముఖ్యంగా లోన్ యాప్ ల మోసాలు, ఫోక్సో నేరాలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని ప్రత్యేకంగా ఆదేశించినారు. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యొక్క యోగక్షేమాల విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందే వ్యవస్థకు వెన్నెముక అని తెలియజేసారుఈ కార్యక్రమంలో చిలకలూరిపేట రూరల్ సి.ఐ B. సుబ్బ నాయుడు , నాదెండ్ల పోలీస్ స్టేషన్ యస్.ఐ G.పుల్లారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube