BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 08:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతులు పంటల బీమా నమోదు చేసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 08:13 PM
103 వీక్షణలు

పంటల బీమా నమోదు చేసుకోండి – రైతులకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ పిలుపు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని రైతులు ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు తప్పనిసరిగా పంటల బీమా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు, కరువు, తుఫానులు తదితర అనుకోని పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు బీమా నమోదు చేయించుకోవడం ద్వారా పంట నష్టాల సమయంలో పరిహారం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వరి పంటకు పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఆగస్టు 15, 2026 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రైతులు తమ సమీపంలోని సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీలు) లేదా ఎన్‌సీఐపీ యాప్ ద్వారా పంటల బీమా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసి పంటలకు బీమా రక్షణ పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.