www.ntodaynews.com
పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల చేసిన కేంద్రం
జాతీయం
పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల్లో వాటాగా ఆగస్టు నెలకు సంబంధించిన నిధులను ముందుగానే విడుదల చేసింది. మొత్తం రాష్ట్రాలకు కలిపి రూ.1,09,019 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు కేటాయించింది.
ఈ నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన వంటి అవసరాలకు వ్యయాన్ని సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.