BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 25 June 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పొగాకు రైతుల తరఫున ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గళం.. బ్యారెన్ కోటా 40 క్వింటాళ్లకు పెంచాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
107 వీక్షణలు

ఏలూరు, జూన్ 25: పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పొగాకు బోర్డును కోరారు. గుంటూరులో గురువారం జరిగిన పొగాకు బోర్డు సమావేశంలో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఆయన, రైతుల సమస్యలను బోర్డు సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవల ఏలూరులో తనను కలిసిన పొగాకు రైతులు యార్డుల్లో కొనుగోలు ధరలు పడిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని ఎంపీ సమావేశంలో ప్రస్తావించారు. కనీసం క్వింటాల్‌కు రూ.300 ధర లభించకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని వివరించారు.

ముఖ్యంగా పొగాకు బ్యారెన్‌కు ఉత్పత్తి పరిమితిని 35 క్వింటాళ్లుగా నిర్ణయించడం రైతులకు గిట్టుబాటు కాదని పేర్కొన్నారు. దిగుబడులు తగ్గడం, పెట్టుబడి వ్యయాలు పెరగడం వంటి పరిస్థితుల్లో గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బ్యారెన్‌కు ఉత్పత్తి పరిమితిని 40 క్వింటాళ్లకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని NLS పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యారెన్ కోటాను 40 క్వింటాళ్లకు పెంచాలని బోర్డును ఎంపీ విజ్ఞప్తి చేశారు.

ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన యశ్వంత్ కుమార్, రైతుల డిమాండ్లను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, కొనుగోలుదారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.