BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 28 June 2026, 11:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

Health: పోలిశెట్టిపాడులో పల్స్ పోలియో కార్యక్రమం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 11:57 AM
165 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా | తిరువూరు నియోజకవర్గం | జూన్ 29 | NTODAY NEWS

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు.

తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సమీప పోలియో కేంద్రాలకు తమ పిల్లలను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బొల్లికొండ శ్రీను, బొల్లిపోగు విజయ్, మిద్దె నాగేంద్ర, వాసం శ్రీనివాసరావు, మరీదు కృష్ణారావు, కోమ్ము రాజేష్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.