BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 11 August 2026, 10:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలవరం గ్రామాభివృద్ధికి పానుగంటి కుటుంబం చేయూత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 10:23 PM
342 వీక్షణలు

పోలవరం గ్రామాభివృద్ధికి పానుగంటి కుటుంబం చేయూత

  • ఆర్‌సీఎం చర్చి ప్రహరీ గోడ నిర్మాణానికి మెటీరియల్‌ అందిస్తామని హామీ

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో సేవా కార్యక్రమాలకు పానుగంటి కుటుంబం మరోసారి ముందుకు వచ్చింది. పోలవరం గ్రామానికి చెందిన కీర్తిశేషులు పానుగంటి సత్యం జ్ఞాపకార్థం ఆయన కుమారులు పానుగంటి మహేష్ గౌడ్, పానుగంటి సూరిబాబు మంగళవారం పోలవరం పడమటి హరిజనవాడలో ఆర్‌సీఎం సంఘ సభ్యులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆర్‌సీఎం సంఘ పెద్దలు డోలా సుబ్బారావు, చాట్ల రామస్వామి, తనగల హుజూర్ కోట రవి, ఆమేర్ల ధర్మారావు, పర్స వెంకటేశ్వరరావు, దుబ్బాక నాగేష్ తదితరుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఆర్‌సీఎం చర్చి ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తన వంతు సహాయంగా అందించేందుకు పానుగంటి మహేష్ గౌడ్, పానుగంటి సూరిబాబు ముందుకు వచ్చారు. చర్చి మూడు వైపులా ప్రహరీ గోడ నిర్మాణానికి అయ్యే ఖర్చుకు అవసరమైన నిర్మాణ సామగ్రిని సమకూర్చుతామని సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు.

పదేళ్లుగా సేవా కార్యక్రమాలు

పానుగంటి కుటుంబం గత కొంతకాలంగా పోలవరం గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కీర్తిశేషులు పానుగంటి సత్యం జ్ఞాపకార్థం ఆయన కుమారులు గత పదేళ్లుగా గ్రామంలో వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గ్రామంలోని హిందూ దేవాలయాలకు అవసరమైన వసతులు, నిర్మాణ సామగ్రిని కూడా అందిస్తూ ఆలయాల అభివృద్ధికి సహకరిస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకుండా విద్యార్థులకు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పానుగంటి కుటుంబ సభ్యులు తెలిపారు. మతాలు, వర్గాలకు అతీతంగా గ్రామ అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు కొనసాగించడం తమ కుటుంబం బాధ్యతగా భావిస్తోందని పేర్కొన్నారు.

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం

కీర్తిశేషులు పానుగంటి సత్యం జ్ఞాపకార్థం గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పానుగంటి మహేష్ గౌడ్, పానుగంటి సూరిబాబు తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన సందర్భాల్లో తమ వంతు సహకారం అందించడం కొనసాగిస్తామని ‘ఎన్‌టుడే న్యూస్’కు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌సీఎం సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు పానుగంటి కుటుంబాన్ని అభినందించారు.