BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 22 June 2026, 06:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులపై జాయింట్ కలెక్టర్‌కు వినతి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 06:30 PM
115 వీక్షణలు

కందుకూరు: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేయడం, పాఠ్యపుస్తకాలను అధిక ధరలకు విక్రయించడం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ మానవ హక్కుల సంఘం, అవినీతి వ్యతిరేక అసోసియేషన్ నాయకులు అధికారులను కోరారు.

జాతీయ అధ్యక్షుడు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి, జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రొడ్డా తిరుపతయ్య ఆదేశాల మేరకు సంఘం ప్రతినిధులు కందుకూరులో సబ్ కలెక్టర్ డి. హిమవంసిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

కందుకూరు డివిజన్ పరిధిలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, పాఠ్యపుస్తకాలను కూడా యాజమాన్యాలే విక్రయిస్తూ భారీ మొత్తాలు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. మొదటి తరగతి పుస్తకాలకే రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ప్రైవేటు విద్యాసంస్థలో తరగతుల వారీగా ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాల విక్రయాలు చేపడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా డివిజన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులతో పాటు పుస్తకాల ధరలను కూడా ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని అన్నారు. అలాగే రెండో శనివారం సెలవులు అమలు చేయడం లేదని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారానికి కనీసం ఒకరోజు శారీరక విద్య (పీఈటీ) తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎస్.డి. గౌస్ బాషా, వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం, వైస్ సెక్రటరీ మనోహర్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్. మాధవి తదితరులు పాల్గొన్నారు.