BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఘన సన్మానం

తెలంగాణ
/ నల్గొండ
17 May, 2026 - 06:24 PM
154 వీక్షణలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఘన సన్మానం NTODAY NEWS నల్గొండ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 11 నుండి 17 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ‘ప్రత్యేక విద్యా వారోత్సవాలు’ ఆదివారం ఘనంగా ముగిశాయి. వారోత్సవాల ముగింపు రోజైన మే 17న జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో మరియు క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఘనంగా సన్మానించి నగదు పురస్కారాలను అందజేశారు. ​ఇటీవల విడుదలైన పదవ తరగతి  ఫలితాలలో చిట్యాల మండలం, చిన్నకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  చెందిన విద్యార్థిని హెచ్.  శ్రీవిద్య జిల్లా స్థాయిలో ద్వితీయ టాపర్‌గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని నిరూపించిన శ్రీవిద్య ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు పది వేల రూపాయలు నగదు పురస్కారంతో పాటు శాలువా కప్పి, మెమెంటోతో ఘనంగా సన్మానించారు. ​జాతీయ స్థాయి యోగా విజేతలకు ప్రోత్సాహం ​విద్యా రంగంతో పాటు క్రీడా రంగంలోనూ చిన్నకాపర్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ముద్ర వేశారు. త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన జాతీయ స్థాయి యోగా పోటీలలో పాల్గొని ప్రతిభ చాటిన విద్యార్థులు బొల్లం నితీష్ కుమార్, రొండి శరత్ లని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో వారిద్దరికీ చెరొక్కరికి  ఐదు వేల రూపాయలు నగదు పురస్కారాన్ని అందించి సత్కరించారు. ​జిల్లా స్థాయిలో ఘన విజయం సాధించి, గ్రామానికి మరియు పాఠశాలకు తీరని కీర్తి తెచ్చిన విద్యార్థులకు చిట్యాల మండల విద్యాధికారి  పానుగోతు సైదా నాయక్ మరియు చిన్నకాపర్తి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాలని వారు ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి  బొల్లారం బిక్షపతి మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వల్లే విద్యార్థులు ఇలాంటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని, తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల విద్యాధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు మరియు తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.