BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 20 July 2026, 08:13 pm
Posted by : V శ్రీనివాస్

​ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
20 Jul, 2026 - 08:13 PM
98 వీక్షణలు

​ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ

 రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు అందజేత

​(మంచిర్యాల/హాజీపూర్):గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధికి 'రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్' విశేష కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిట్లను పంపిణీ చేశారు.

​హాజీపూర్ మండలంలోని రాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అలాగే లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు రఘునాథ్ వెరబెల్లి గారు స్వయంగా విచ్చేసి ఈ కిట్లను అందజేశారు.

​ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, వారి విద్యావసరాలకు తమ ఫౌండేషన్ ద్వారా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, స్థానిక ప్రజాప్రతినిధులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఫౌండేషన్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు