BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 05 August 2026, 07:00 pm
Posted by : కూనురు మధు

ప్రభుత్వ, టీటీడీ భూముల రక్షణే మా ధ్యేయం : చిట్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Aug, 2026 - 07:00 PM
164 వీక్షణలు

ప్రభుత్వ, టీటీడీ భూముల రక్షణే మా ధ్యేయం : చిట్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ పందిరి గీత  

చిట్యాల పట్టణాభివృద్ధికి, ప్రభుత్వ మరియు టీటీడీ భూమి మరియు  మున్సిపాలిటీకి చెందిన భూముల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. ఇటీవల పట్టణంలోని 649 సర్వే నంబర్‌లోని టీటీడీ దేవస్థానం భూములు మరియు మున్సిపాలిటీ 10 శాతం ల్యాండ్లకు సంబంధించి వచ్చిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తాము ఎదుర్కొంటున్న ఆరోపణలపై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 16న బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపల్ 10% స్థలాలు, ప్రభుత్వ భూములను వెలికితీసే ప్రక్రియ వేగవంతం చేశామని తెలిపారు. 2024 నాటి మెమొరండం ప్రకారం భూ యజమానులతో మాట్లాడి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పట్టణంలో కబ్జాలో ఉన్న 10 శాతం  స్థలాలు , అనుమతులు లేని అనాథరైజ్డ్ వెంచర్లలోని భూములపై  ప్రభుత్వ లాయర్ సలహాతో లీగల్ అడ్వైస్ తీసుకుంటున్నామని, త్వరలోనే మున్సిపల్ కౌన్సిల్‌లో కఠిన తీర్మానం ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. గడిచిన ఆరు నెలల కాలంలో ముగ్గురు కమిషనర్లు మారడం వంటి సాంకేతిక కారణాల వల్ల కొన్ని పనులు ఆలస్యమయ్యాయని వివరణ ఇచ్చారు. ఒక్క ఆధారం లేకుండా తనపై, తన కుటుంబంపై వ్యక్తిగత కక్షతో నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. గతంలో కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా చేసిన ప్రమాణానికి కట్టుబడి చిట్యాల రూపురేఖలు మారుస్తానని, సంకర రాజకీయాలు మాని ప్రతిపక్షాలు కూడా పట్టణాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వీరేశం ఆశీస్సులతో ప్రజాసంక్షేమం, భూముల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతానని తేల్చిచెప్పారు ఇవిలే కుల సమావేశంలో స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.