BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 Apr, 2026 - 03:42 PM
218 వీక్షణలు

ప్రభుత్వం,పాలకులు మారుతున్న పరిష్కారం కానీ రోడ్డు,యావపూర్ నుండి ఎర్రగుంట్ల వరకు వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలోని యావపూర్ తండా నుంచి జలాల్ పూర్ వయా ఎర్రగుంట్ల వరకు వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి అని గురువారం రోజున  సిపిఎం పార్టీ జలాల్ పూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం మాట్లాడుతూ యావపూర్ తండా  నుండి ఎర్రగుంట్ల వరకు గుంతల మయంగా మారిన రోడ్డును వెంటనే పూర్తి చేయాలన్నారు వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించగా గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం వారు పడుతున్న ఇబ్బందులకు నిదర్శనం అని అన్నారు సంవత్సరాలు గడుస్తున్న  ఎక్కడ వేసిన గొంగడి లాగానే రోడ్డు మరమ్మత్తులు పనులు కూడా ఉన్నాయని అన్నారు ప్రజలు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని,వాహనాల దుమ్ముకు ఆరోగ్యం హాని జరగడంతో హాస్పటల్ పాలవుతున్నారని అన్నారు దుమ్ము వలన పొలాలకు నష్టం జరుగుతూ ఇటు జనాల ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాధుడే లేడని, వెంటనే రోడ్డు మరమ్మత్తుల పనులు ప్రారంభించాలని అన్నారు లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ముట్టడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి బ్రహ్మచారి, శ్రీరాములు,నాయక్, బూడిద శ్రీరాములు, వెంకటేష్, గురువయ్య, మల్లేష్, దేశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు