BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 16 March 2026, 03:36 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య ఎల్. సి. మల్లయ్య

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
16 Mar, 2026 - 03:36 PM
271 వీక్షణలు

కుప్పం, మార్చి 16, 2026

కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి కార్యాలయంలో ఆచార్య ఎల్. సి. మల్లయ్య సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా సేవలందిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొని ఆచార్య ఎల్. సి. మల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆచార్య ఎల్. సి. మల్లయ్య మాట్లాడుతూ ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని విద్య, పరిశోధన మరియు పరిపాలన రంగాల్లో మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆచార్యులు, సిబ్బంది మరియు విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని, అందరి సహకారంతో విశ్వవిద్యాలయాన్ని పురోగతిపథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్, డీన్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య కే. శ్యామల, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఆచార్య శ్రీదేవి, అలాగే వివిధ స్కూల్స్ డీన్స్ పాల్గొన్నారు.

డా. పి. ఎస్. గణేష్ మూర్తి

ప్రజాసంబంధాల అధికారి

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం