BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 05:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజానేత గొర్రె లాజర్ మృతి పట్ల సర్వత్రా సంతాపం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:37 PM
163 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ప్రముఖ ప్రజానేత, ప్రస్తుత వైఎస్ఆర్‌సీపీ నేత, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొర్రె లాజర్ (71) గుండెపోటుతో జూన్ 2 రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో విస్సన్నపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గొర్రె లాజర్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఆయన, సంస్థ కార్యక్రమాల కోసం మందాకృష్ణ మాదిగను విస్సన్నపేటకు ఆహ్వానించి ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సిండికేట్ బ్యాంకులో ఉద్యోగిగా సేవలందించిన ఆయన పదవీ విరమణ అనంతరం కూడా ప్రజాసేవను కొనసాగిస్తూ సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

ప్రజా సమస్యలపై రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి పనిచేసిన లాజర్ మృతి పేద ప్రజలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన డి. హరినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాలు వేరైనా ప్రజా ప్రయోజనాల విషయంలో లాజర్‌తో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు.

గొర్రె లాజర్ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.