BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 22 August 2026, 07:36 pm
Posted by : కూనురు మధు

ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన గ్రీన్ గ్రోవ్ స్కూల్ ఎన్నికలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Aug, 2026 - 07:36 PM
324 వీక్షణలు

ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన గ్రీన్ గ్రోవ్ స్కూల్ ఎన్నికలు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉట్టిపడేలా శనివారం స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలలో విద్యార్థులు తమ ప్రతినిధులను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. బాలుర విభాగంలో 9వ తరగతికి చెందిన ఏ. సాత్విక్ స్కూల్ పీపుల్ లీడర్‌గా, బాలికల విభాగంలో ఆగు దివ్యభాను ఎన్నికయ్యారు. స్పోర్ట్స్ హెడ్ బాయ్‌గా ఎస్.కె. సోను సోయల్, స్పోర్ట్స్ హెడ్ గర్ల్‌గా ఆర్. వైష్ణవి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన నాయకులతో పాఠశాల నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు ఆచరణాత్మకంగా తెలియజేయాలనే ఉద్దేశంతో స్కూల్ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

విద్యార్థుల సమస్యలను  యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు అలాగే విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్  ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.