BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 11:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజల మధ్యలో ఎమ్మెల్యే కొలికపూడి.. సమస్యలు తెలుసుకుంటూ భరోసా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 11:02 AM
75 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే

తిరువూరు, ఆగస్టు 22:

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పర్యటించారు. శుక్రవారం ఉదయం తిరువూరు పట్టణంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు.

మార్గమధ్యంలో కలిసిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ‘‘ఏమైనా సమస్యలు ఉన్నాయా?’’ అంటూ నేరుగా వివరాలు సేకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.

అనంతరం పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులను ఎమ్మెల్యే పలకరించారు. వారి కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.