BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 04 June 2026, 06:09 pm
Posted by : V శ్రీనివాస్

​​ప్రజల సంక్షేమాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 06:09 PM
256 వీక్షణలు

​​​​ప్రజల సంక్షేమాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

  • ​గ్రామసభలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడ
  • ​రాపల్లి గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్, అధికారులు
  • ​రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

ప్రజల సంక్షేమం, అభివృద్ధే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం హాజీపూర్ మండలం రాపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సాయి వెంకట్ రెడ్డి, మండల విద్యాధికారి తిరుపతి, సర్పంచ్ రామ్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో ప్రత్యేక సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.

​ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నందున, అందుకు అనుగుణమైన ప్రత్యామ్నాయ పంటలను రైతులు ఎంపిక చేసుకోవాలని, దీనిపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్ నమోదు వివరాల ఆధారంగా విడతల వారీగా యూరియా అందిస్తామని, నానో యూరియా, డి ఎ పి, ప్రభుత్వ ధృవీకృత విత్తనాలనే వాడాలని కోరారు. భూమి రకాన్ని బట్టి పత్తి ఎకరానికి 14 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, రైతులకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. చిన్న, సన్నకారు రైతులు కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని, దీనికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని తెలిపారు. పకడ్బందీ పారిశుధ్య నిర్వహణ వల్లే జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు ఎలాంటి డెంగ్యూ కేసులు నమోదు కాలేదని, ప్రతిరోజూ తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి ఎరువు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

​ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ, జనగణన కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని, ఓటరు గుర్తింపు ప్రక్రియను పటిష్టం చేసి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా నాణ్యమైన విద్య, వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉదయపు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని, ఈ ఏడాది 98 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళికల వల్ల ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. వైద్యం, విద్య, మహిళా రక్షణ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ప్రజలు తమ సమస్యలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్ల దృష్టికి తీసుకురావచ్చని, ఇందుకోసం ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు