BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 11 May 2026, 04:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రకృతి వ్యవసాయంలో PMDS సాగుతో రైతులకు లాభాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 May, 2026 - 04:58 PM
165 వీక్షణలు

ప్రకృతి వ్యవసాయంలో PMDS సాగుతో రైతులకు లాభాలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో రైతులు పంటలు కోసిన అనంతరం జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులను పెంచడంతో పాటు ప్రకృతి వ్యవసాయంలో PMDS (ప్రీ మాన్సూన్ సోయింగ్ సాగు) విధానాన్ని అవలంబించాలని వ్యవసాయ శాఖ సూచించింది. నవధాన్యాల సాగు ద్వారా సంవత్సరం పొడవునా భూమి పంటలతో కప్పబడి ఉండేలా చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.

ఈ PMDS విధానంలో పప్పు జాతి, నూనె జాతి, పచ్చిరొట్ట, ధాన్యపు జాతులకు చెందిన మినుములు, పెసర, బొబ్బర్లు, ఆముదాలు, నువ్వులు, రాగులు, సజ్జలు, జొన్నలు, తోటకూర, పాలకూర విత్తనాలను కలిపి ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోల వరకు విత్తనాలు చల్లితే భూమి పూర్తిగా కప్పబడి సాగు ప్రక్రియ సులభమవుతుందని అధికారులు తెలిపారు.

PMDS విధానం వల్ల కలిగే ప్రయోజనాలు

వివిధ రకాల పంటల వల్ల నేలలో సూక్ష్మజీవులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

నేల గుల్లగా మారి వానపాముల సంఖ్య పెరుగుతుంది.

పచ్చి మేతగా వినియోగించుకోవచ్చు.

భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.

పలు రకాల పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.

నేలలో సేంద్రీయ కార్బన్ పదార్థం పెరుగుతుంది.

ప్రధాన పంటల్లో కలుపు మొక్కలు తగ్గుతాయి.

రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది.

జీవ వైవిధ్యం పెరుగుతుంది.

ఈ నవధాన్యాల సంచులు ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, VAA/VHAల ద్వారా రైతులకు ఈ వారం రోజులలో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చాట్రాయిలోని RSK కేంద్రంలో కొంతమంది రైతులకు నవధాన్యాల సంచులను అందజేశారు. కార్యక్రమంలో FMMT కన్నమ్మ, ఐసిఆర్పీలు, VAA & VHAలు పాల్గొన్నారు. ఈ విషయాన్ని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ వెల్లడించారు.