BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 May 2026, 07:38 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రమాదంలో యూట్యూబర్ మృతి..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:38 AM
140 వీక్షణలు

ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. కుటుంబానికి 5 లక్షల సహాయం చేసిన 164 గ్రామాల మత్స్యకార కాపులు

ఒంగోలు ప్రాంతానికి చెందిన యువ యూట్యూబర్, అనుపాత్రికేయుడు శివారెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కడలూరు మరబోట్ల వివాదంపై నిర్వహించిన సమావేశానికి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన శివారెడ్డి, తిరుగు ప్రయాణంలో చాకిచెర్ల తుమ్ములు మలుపు వద్ద జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడికి భార్యతో పాటు 9 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆదారంగా ఉన్న శివారెడ్డి ఆకస్మిక మరణంతో వారు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లారు.

ఈ విషాదం గురించి తెలుసుకున్న 164 గ్రామాల మత్స్యకార కాపులు మానవత్వంతో స్పందించారు. ముందుగా ఇచ్చిన హామీ మేరకు సమావేశం నిర్వహించి, శివారెడ్డి ఇద్దరు చిన్నారుల పేర్లపై రూ.5 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్‌గా జమ చేయనున్నట్లు ప్రకటించారు.

సమావేశానికి చిన్నారులను తీసుకురాగానే వారి పరిస్థితి చూసి కాపులు భావోద్వేగానికి గురయ్యారు. “మా జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుని కుటుంబానికి న్యాయం చేయడం మా బాధ్యత” అని తెలిపారు.

కాపుల ఈ సహాయ చర్యపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సహచర పాత్రికేయులు కూడా కాపుల సేవాభావానికి కృతజ్ఞతలు తెలిపారు.