BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 04 August 2026, 01:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రోటోకాల్ గందరగోళం.. నిలిచిపోయిన భూ పాస్ పుస్తకాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Aug, 2026 - 01:33 PM
156 వీక్షణలు

ప్రోటోకాల్ గందరగోళం.. నిలిచిపోయిన భూ పాస్ పుస్తకాల పంపిణీ

ఏ.కొండూరు, ఆగస్టు 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న "మీ భూమి–మీ హక్కు" కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం అట్లప్రగడ గ్రామంలో మంగళవారం వివాదానికి దారితీసింది. అధికారుల ప్రోటోకాల్ లోపం కారణంగా రైతులకు పంపిణీ చేయాల్సిన కొత్త భూ పాస్ పుస్తకాల కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు.

ప్రభుత్వం భూ యజమానుల హక్కులను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాజముద్రతో కూడిన కొత్త భూ పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తోంది. ఇందులో భాగంగా అట్లప్రగడ గ్రామంలోని 790 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరుకావాల్సి ఉండగా, నిర్ణీత సమయానికి ఆయన కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు.

అయితే ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నప్పటికీ, కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ శాఖ అధికారులు, పంచాయతీ శాఖ అధికారులు హాజరు కాకపోవడం వివాదానికి కారణమైంది. ప్రజాప్రతినిధికి ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన మర్యాద, సమన్వయం కనిపించకపోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కార్యక్రమ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులకు అందజేయాల్సిన పాస్ పుస్తకాల పంపిణీ నిలిచిపోయింది. ఎంతో ఆశతో కార్యక్రమానికి వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగారు.

అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పొలాల్లో వరి నాట్లు వేస్తున్న మహిళా రైతులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత సాగు పరిస్థితులు, కూలీల లభ్యత, వ్యవసాయ ఖర్చులు, నీటి లభ్యత వంటి అంశాలపై రైతులతో చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.

గ్రామ పర్యటన సందర్భంగా స్థానికులు తాగునీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన గ్రామంలో తాగునీటి కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ప్రభుత్వం రైతుల హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం పాటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు పేర్కొన్నారు.

అధికారుల గైర్హాజరు కారణంగా రైతులకు పంపిణీ చేయాల్సిన భూ పాస్ పుస్తకాలు అందకుండా పోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, ప్రోటోకాల్ ఉల్లంఘనకు కారణమైన అంశాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.