BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 05 June 2026, 07:43 pm
Posted by : BATHULA VENKATESH

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
05 Jun, 2026 - 07:43 PM
119 వీక్షణలు

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని సంరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు అని అన్నారు. కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు వంటి సమస్యలు భూమికి తీవ్ర ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం, అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేసినప్పుడే ప్రకృతి సంక్షోభాన్ని అధిగమించగలమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తుల రమణబాబు, సూరిబాబు, తాతారావు, జనసేన నాయకుడు వెంకటరమణ, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.