BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 10 August 2026, 10:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రతాప్‌రెడ్డి ఒంటరిగానే వస్తాడు.. 70 వేల మెజారిటీతో గెలిపిస్తాం

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 10:57 AM
78 వీక్షణలు

‘ప్రతాప్‌రెడ్డి ఒంటరిగానే వస్తాడు.. 70 వేల మెజారిటీతో గెలిపిస్తాం’ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మురళి యాదవ్ తీవ్ర విమర్శలు

కావలి: తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేసినందుకు తన రాజకీయ జీవితమే నాశనమైందని వైసీపీ నేత మురళి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో నిర్వహించిన నిరసన దీక్షలో కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించారు.

తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య తిరిగామని, ప్రస్తుతం అధికారం కోల్పోయినా ప్రజల సమస్యలపై పోరాడుతూ క్షేత్రస్థాయిలోనే ఉన్నామని మురళి యాదవ్ తెలిపారు. “మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా బజార్లలో కనిపిస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు.

కావలిలో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పనిచేసినందుకు తన జీవితమే నాశనమైందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

‘ప్రతాప్‌రెడ్డి సింగిల్‌గానే వస్తాడు’

రాబోయే ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డి ఒంటరిగానే బరిలోకి వస్తారని, ప్రజల మద్దతుతో ఆయనను 70 వేల మెజారిటీతో గెలిపిస్తామని మురళి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో తమకు ఉన్న అనుబంధమే తమ బలమని పేర్కొన్నారు.

డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దీక్ష

డీఎస్సీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మురళి యాదవ్ మాట్లాడుతూ డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని మురళి యాదవ్ తెలిపారు.