BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 09 April 2026, 04:53 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 Apr, 2026 - 04:53 PM
147 వీక్షణలు
ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయం--రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క 

విద్యార్థుల ఎదుగుదలే రాష్ట్ర ఎదుగుదల, వారి భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని రాష్ట్ర ఉప మఖ్యమంత్రి  మల్లు బట్టి విక్రమార్క అన్నారు మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో  అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో ఉచితంగా విద్యార్థినులకు సైకిళ్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలే రాష్ట్ర ఎదుగుదల, వారి భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని పేర్కొన్నారు. విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు 13.5 శాతం నిధులు కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు.గత పదేళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక భారం ఉన్నప్పటికీ డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు.మన సహజ వనరులతో పాటు మానవ వనరులను కూడా సమర్థంగా తీర్చిదిద్దేందుకు అవసరమైనన్ని నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడదని స్పష్టం చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సమయాన్ని ఆదా చేయడం, వారికి శ్రమ తగ్గించడం లక్ష్యంగా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్లు తెలిపారు. సైకిళ్లు వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, సురక్షితంగా పాఠశాలలకు రాకపోకలు సాగించాలని సూచించారు.
విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారేందుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.