BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 24 September 2026, 01:28 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై పార్టీల వ్యూహాలు..

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Sep, 2026 - 01:28 PM
60 వీక్షణలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై పార్టీల వ్యూహాలు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

ఎన్ టుడే న్యూస్ | హైదరాబాద్: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపికతో పాటు ఓటర్ల నమోదు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై కసరత్తు చేస్తున్నాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు 2027 మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి.

కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆశావహుల నుంచి పేర్లను పరిశీలించి, ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున పేర్లను ఎంపిక చేసి అధిష్ఠానానికి పంపే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఓ జర్నలిస్ట్‌తో పాటు మంత్రి సోదరుడి పేరు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ పేర్లపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. TPCC షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లను ఈ నెలాఖరులోగా అధిష్ఠానానికి పంపే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇక బీఆర్ఎస్ కూడా రెండు స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన అనుగుల రాకేశ్ రెడ్డి మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపే అంశాన్ని బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ కూడా రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎన్. రామచందర్‌రావు పేరు మరోసారి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు.

మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన గ్రాడ్యుయేట్లు కూడా తాజాగా ఫారం-18 ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించారు.

రెండు స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపికతో పాటు గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కీలకంగా మారడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నాయి.