BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

ఏపీ ఎడ్‌సెట్–2026ను విజయవంతంగా నిర్వహించిన ద్రావిడ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
26 May, 2026 - 03:21 PM
532 వీక్షణలు

ఏపీ ఎడ్‌సెట్–2026ను విజయవంతంగా నిర్వహించిన ద్రావిడ విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APEDCET–2026) నిర్వహణ బాధ్యతను ద్రావిడ విశ్వవిద్యాలయం, శ్రీనివాసవనం, కుప్పంకు అప్పగించారు.

ఈ పరీక్షను 2026 మే 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత సాఫీగా, పారదర్శకంగా మరియు విజయవంతంగా నిర్వహించారు. పరీక్షను రెండు షిఫ్టులలో నిర్వహించారు.

మొదటి షిఫ్ట్ : ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు

రెండవ షిఫ్ట్ : మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2.30 గంటల వరకు

రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో ఏర్పాటు చేసిన 90 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ద్రావిడ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు APSCHEకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను విశ్వవిద్యాలయంపై నమ్మకంతో అప్పగించినందుకు విశ్వవిద్యాలయం తన కృతజ్ఞతాభివందనాలు తెలియజేసింది.

మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షను సమర్థవంతంగా, పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించడం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని పేర్కొంది.

అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి, రియల్ టైం గవర్నెన్స్ మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. APEDCET–2026 నిర్వహణ బాధ్యతను విశ్వవిద్యాలయానికి అప్పగించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపింది.

అదేవిధంగా APEDCET–2026 ఫలితాలను విడుదల చేయడానికి సమయం కేటాయించిన శ్రీ నారా లోకేష్ గారికి, పరీక్ష నిర్వహణలో అందించిన నిరంతర మార్గదర్శకత్వం, ప్రోత్సాహం మరియు సహకారానికి విశ్వవిద్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.

ద్రావిడ విశ్వవిద్యాలయం, శ్రీనివాసవనం, కుప్పంలోని APEDCET–2026 కార్యాలయంలో నిర్వహించిన ఫలితాల విడుదల కార్యక్రమంలో గౌరవ ఉపకులపతి మరియు APEDCET–2026 ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.సి. మల్లయ్య గారు ఫలితాలను విడుదల చేశారు.

మొత్తం 19,880 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా, అందులో 19,741 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షలో 99.30 శాతం విజయం సాధించారు.

ఈ కార్యక్రమంలో APEDCET కన్వీనర్ ప్రొఫెసర్ డి. శ్రీనివాస్ కుమార్ గారు, గౌరవ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. కిరణ్ కుమార్ గారు, డీన్ అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె. శ్యామల గారు, కో-కన్వీనర్ డాక్టర్ వి. మర్సీ జ్యోతి గారు పాల్గొన్నారు.

డా. పి. ఎస్. గణేష్ మూర్తి

పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

ద్రావిడ విశ్వవిద్యాలయం

కుప్పం, ఆంధ్రప్రదేశ్