BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 25 March 2026, 08:12 pm
Posted by : M. రాజశేఖర్

ద్రావిడ విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు మరియు శతజయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
25 Mar, 2026 - 08:12 PM
164 వీక్షణలు

ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ వి. ఐ. సుబ్రహ్మణ్యం ద్రావిడ అధ్యయనాలకు చేసిన సేవలపై ఒకరోజు జాతీయ సదస్సు మరియు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ద్రావిడ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో “ప్రొఫెసర్ వి. ఐ. సుబ్రహ్మణ్యం ద్రావిడ అధ్యయనాలకు చేసిన సేవలు మరియు శతజయంతి వేడుకలు” అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు 25 మార్చి 2026న విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎమెన్యూ గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ  ఉపకులపతి ఆచార్య  ఎల్.సి .మల్లయ్య  హాజరై ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ఆచార్య వి.ఐ సుబ్రహ్మణ్యం గారిని బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ పండితుడు, దూరదృష్టి కలిగిన విద్యావేత్త మరియు నిబద్ధత గల పరిపాలకుడిగా అభివర్ణించారు. తమిళ విశ్వవిద్యాలయం మరియు ద్రావిడ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థల అభివృద్ధిలో ఆయన చేసిన కీలక పాత్రను గుర్తుచేశారు. సంప్రదాయ పాండిత్యాన్ని ఆధునిక భాషా శాస్త్ర విధానాలతో సమన్వయం చేసిన ఆయన కృషి దేశ మేధో ప్రపంచంపై చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయ స్థాపన దినోత్సవం సందర్భంగా “ప్రొఫెసర్ వి. ఐ. సుబ్రహ్మణ్యం స్మారక ఉపన్యాసం” నిర్వహించనున్నట్లు ఉపకులపతి  ప్రకటించారు.

ముఖ్యోపన్యాసకులుగా పాల్గొన్న ద్రావిడ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి డాక్టర్ చెల్లప్ప  “విశ్వవిద్యాలయ ఆవిర్భావం – ప్రొఫెసర్ వి. ఐ. సుబ్రహ్మణ్యం గారి పాత్ర” అనే అంశంపై ప్రసంగిస్తూ, 1997లో ద్రావిడ విశ్వవిద్యాలయం స్థాపనకు ఆయన చేసిన పోరాటాన్ని వివరించారు. ఆయనను సాదాసీదా స్వభావం గల పరిపాలన నిర్మాతగా అభివర్ణించారు. ప్రో-చాన్సలర్‌గా విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

సదస్సు నిర్వాహకులు సదస్సు లక్ష్యాలు మరియు అంశాన్ని వివరిస్తూ, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారి సేవల ప్రాధాన్యాన్ని వివరించారు.

ఈ సందర్భంగా “ప్రొఫెసర్ వి. సుబ్రహ్మణ్యం వారసత్వం – ద్రావిడ అధ్యయనాల్లో శతజయంతి నివాళి” అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు The Legacy of Professor V. Subramanyam in Dravidian Studies: A Centenary Tribute).

Prof. Kiran Kumar గారు తన ప్రసంగంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారి విద్యాభ్యాస ప్రయాణాన్ని వివరించారు. ప్రాథమిక విద్య అనంతరం తిరునెల్వేలిలోని మదురై దిరవియం తాయుమానవర్ హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించినట్లు తెలిపారు. అనంతరం అన్నామలై విశ్వవిద్యాలయం లో చేరి తన మేధో వికాసాన్ని పెంపొందించుకున్నారని చెప్పారు. భాషా శాస్త్రంలో ఉన్నత అధ్యయనాల కోసం అమెరికాలోని Indiana University Bloomington లో డాక్టరేట్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

Prof. Syamala గారు ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు మరియు పరిశోధనా పద్ధతుల పరిచయం ఆయన దృష్టిని విస్తరించిందని, విశ్లేషణాత్మక సామర్థ్యాలను బలోపేతం చేసిందని తెలిపారు.

ఈ సదస్సుకు NSR 100 Educational Trust ఆర్థిక సహకారం అందించగా, దాని ఛైర్మన్ ఆచార్య రామలింగం గారి సహకారం విశేషమైంది.

ఈ కార్యక్రమంలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.

డాక్టర్ పి ఎస్ గణేష్ మూర్తి

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం