BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 07:41 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అంబేద్కర్ సర్కిల్‌లో దళిత సంఘాల నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 07:41 AM
127 వీక్షణలు

మిద్దింటి వెంకటస్వామి 6వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

అంబేద్కర్ సర్కిల్‌లో దళిత సంఘాల నివాళులు

పుంగనూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మిద్దింటి వెంకటస్వామి 6వ వర్ధంతి కార్యక్రమాన్ని MRPS, MSP మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

దళిత నేత, అంబేద్కర్ ఆశయ సాధకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా MSP పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి బి. నరసింహులు, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, టీడీపీ నాయకుడు రామయ్య, ఏపీ దళిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శంకరప్ప, AITUC నాయకుడు వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ... మిద్దింటి వెంకటస్వామి అణగారిన వర్గాలకే కాకుండా బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు.

ఆయన ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుండి పోరాడి న్యాయం చేయించిన వ్యక్తి అని, ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతాలను అమలు చేయడానికి జీవితాంతం కృషి చేసిన నేతగా ఆయనను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మిద్దింటి వెంకటస్వామి కుమారుడు పృథ్వీ కుమార్, దళిత సంఘాల నాయకులు రాజా, MEF జిల్లా నాయకుడు బోయకొండ శంకర్, MSP నాయకులు మాతంగి నాగభూషణం, ముత్యాల వెంకటరమణ (చిట్టి), చౌడేపల్లి మండల ఇన్చార్జ్ గోవిందు రెడ్డి, మహేష్, నారాయణ, నరసింహులు, గంగరాజు, సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.