BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 08:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన మంత్రి సీతక్కకు ఘన వీడ్కోలు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 08:16 PM
112 వీక్షణలు

అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన మంత్రి సీతక్కకు ఘన వీడ్కోలు

అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు.

అమెరికాలో నిర్వహించిన తెలంగాణ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్‌లో పాల్గొన్న మంత్రి సీతక్క, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవాస తెలంగాణ ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల గురించి సమావేశాల్లో వివరించి తెలంగాణ అభివృద్ధి దిశను ప్రవాసులకు తెలియజేశారు.

పర్యటన సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రవాస భారతీయులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణతో ప్రవాస భారతీయుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మంత్రి సీతక్క అమెరికా పర్యటన విజయవంతంగా ముగియడంతో స్వదేశానికి తిరుగు ప్రయాణం సందర్భంగా హనుమండ్ల ఝాన్సీరెడ్డి విమానాశ్రయానికి వెళ్లి ఆత్మీయంగా వీడ్కోలు పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.