ఘనంగా 34వ వార్షికోత్సవ నంది పురస్కార వేడుకలు: కళాకారులకు నంది బహుమతుల ప్రదానం
జగిత్యాల (Ntoday news):
ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
జగిత్యాల జిల్లాలోని ఉమాశంకర్ గార్డెన్స్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 34వ వార్షికోత్సవ నంది పురస్కార వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్. రమణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పాల్గొని కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నంది బహుమతులు సాధించిన గాయకులు, కళాకారులు మరియు వివిధ రంగాల్లో విశిష్ట పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ నాగలక్ష్మి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలంగాణ కళలు, సాహిత్యం, సంగీతం మరియు సంస్కృతి పరిరక్షణకు, ప్రచారానికి సేవలందిస్తున్న కళాకారులను ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. పురస్కార గ్రహీతలు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు తాటిపత్రి జీవనరెడ్డి, జగిత్యాల జిల్లా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ దావ వసంత, రాయికల్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, కళాకారులు మరియు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.