BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 11:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేస్తోంది: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 11:05 PM
8 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

22-ఏ బాధితుల సమస్యలపై గళమెత్తేందుకు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రామచందర్ రావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టాలంటే ముందుగా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి రావడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిస్థితులు ఏ స్థాయికి చేరాయో తెలియజేస్తోందని విమర్శించారు.

ప్రజల హక్కులను, నిరసన తెలిపే స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుత నిరసనలు కూడా ప్రజల హక్కేనని, వాటిని అడ్డుకోవడం సరికాదని రామచందర్ రావు పేర్కొన్నారు.