286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్ల CMRF చెక్కుల పంపిణీ
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత
మంచిర్యాల | Ntoday News
మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు హాజీపూర్ మండలానికి చెందిన 286 మంది లబ్ధిదారులకు రూ.1,05,47,100 విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో పాటు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు CMRF ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
అనారోగ్య సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, పట్టణ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.