మునుగోడు: రేవంత్‌తో విభేదాలు లేవు.. సీఎం సభకు వేలాదిగా వెళ్తా
సీఎం రేవంత్‌రెడ్డిని తాను ఎప్పుడూ దూషించలేదని, ఒకటి రెండు అంశాల్లో మాత్రమే విభేదించానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు.
కొడంగల్, మధిర నియోజకవర్గాల స్థాయిలోనే తన నియోజకవర్గానికి కూడా నిధులు వచ్చాయని తెలిపారు. మునుగోడు నియోజకవర్గానికి సుమారు రూ.2 వేల కోట్ల నిధులు వచ్చాయని వెల్లడించారు.
త్వరలో జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభకు వేలాది మంది కార్యకర్తలతో హాజరవుతానని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.
రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. నిన్నటి వరకు కనిపించిన విభేదాలు.. నేడు సఖ్యత మాటలుగా మారడంతో “రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే సుమీ” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.