జర్నలిస్టుల జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా బత్తుల గణేష్ నియామకం
- ఉత్తర్వులు జారీ చేసిన చైర్మన్ తోగరి కరుణాకర్
తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బత్తుల గణేష్ నియామకమయ్యారు. జెఏసి చైర్మన్ తొగరి కరుణాకర్ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా నల్గొండ జిల్లా, రామన్నపేట కి చెందిన సంచలనం జాతీయ వార్త పత్రిక చీఫ్ ఎడిటర్ బత్తుల గణేష్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాపై విశ్వాసం ఉంచి, ఎంతో బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు తొగరి కరుణాకర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, సమస్యల పరిష్కారం కోసం జేఏసీ ఆశయాలకు అనుగుణంగా యూనియన్ లు, క్లబ్ లు, అసోసియేషన్ లు అన్ని వర్గాల జర్నలిస్ట్ మిత్రులను కలుపుకుని నిరంతరాయంగా కృషి చేస్తూ, జెఏసి ఆశయాలు నెరవేరే వరకు నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కమిటీల బలోపేతానికి నా వంతు సహకారం అందిస్తాననీ తెలిపారు.