ఎల్కతుర్తి మండల సర్వసభ సమావేశ కార్యక్రమం:
ఎల్కతుర్తి మండల సర్వసభ సమావేశ కార్యక్రమం
ఎల్కతుర్తి :మండలం లో ఈరోజు సర్వసభ సమావేశం ఎంపీడీవో విజయ్ కుమార్, గారి ఆధ్వర్యంలో జరిగింది, గ్రామంలోని పలు సమస్యల గురించి అధికారులతో చర్చించారు, ఇంటి నిర్మాణానికి గ్రామపంచాయతీలో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలనీ కోరారు. మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు విలేజిల్లో విద్యుత్ దీపాల గురించి, సీసీ రోడ్ల గురించి, మోడల్ స్కూల్ దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని కోరారు, అన్ని శాఖల అధికారులు అప్రమంతంగా పనిచేయాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మెరుగైన సేవలు అందించాలని కోరారు.
ప్రభుత్వ వైద్యం అందరూ వినియోగించుకోవాలని, కోరారు డాక్టర్ రాజశేఖర్ గారు మాట్లాడుతూ, మండలంలో 12 గ్రామాలు ఉన్నాయని, గోపాల్పూర్ గ్రామంలో ఎనిమిది గ్రామాలు ఉన్నాయని వివరించారు, అన్ని రకాల టెస్టులు మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు,
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్య: మండలంలో 35 పాఠశాలలు ఉండగా, పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు, గ్రామంలో వివిధ రకాల సమస్యలను ఎలాంటివైనా తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్లను కోరారు.
ఈ సర్వ సభ సమావేశంలో సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ గారు, మండలంలోని వివిధ రకాల అధికారులు,ఎల్కతుర్తి గ్రామ సర్పంచ్, మునిగడప లావణ్య, మరియు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.