శనేశ్వరస్వామికి పంచలోహ కిరీటం సమర్పణ
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.33 వేల విలువైన కిరీటం బహూకరణ
పుంగనూరు | Ntoday News
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని నాగపాళ్యం మెట్లవారి వీధికి చెందిన అంజప్పరెడ్డి–వైజయంతిమాల దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు నవీన్, మధు భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమం నిర్వహించారు.
పుంగనూరు సమీపంలోని 50 రాళ్ల మరువ వద్ద వెలసిన శనేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి రూ.33 వేల విలువైన పంచలోహ కిరీటాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి పంచలోహ కిరీటాన్ని అలంకరించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు దాతలను అభినందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కుమారులు భక్తిశ్రద్ధలతో కిరీటాన్ని సమర్పించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.