BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 08:10 pm
Posted by : కూనురు మధు

నకిరేకల్‌ గడ్డ కాంగ్రెస్‌ అడ్డా.. 2029లోనూ ఇందిరమ్మ పాలన ఖాయం : సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
05 Sep, 2026 - 08:10 PM
57 వీక్షణలు


* నకిరేకల్ లో వంద పడకల ఆసుపత్రి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన 


NTODAY NEWS : నకిరేకల్


నకిరేకల్‌: నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అని, నకిరేకల్‌ గడ్డ కాంగ్రెస్‌ అడ్డా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్‌లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని శంకుస్థాపనలు చేశారు. నకరికల్లు ఏర్పాటు చేసిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.   బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ . 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇందిరమ్మ పాలన కొనసాగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నకిరేకల్‌లో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగితే ఎలా ఉంటుందో. సభకు తరలివచ్చిన జనసంద్రం అలా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం 1000 రోజుల్లో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసి విజయవంతమైందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనను, కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. రైతుల కోసం తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. గత 30 నెలల్లో రైతుల కోసం భారీగా నిధులు ఖర్చు చేశామని పేర్కొన్నారు. రుణమాఫీపై సిద్దిపేట, సిరిసిల్లలో చర్చకు సిద్ధమని, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎంత రుణమాఫీ చేశారో, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంత చేసిందో అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్‌ చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని గతంలో రైతుబంధు ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు బీఆర్‌ఎస్‌ హయాంలో అమలు చేసిన ఏ పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.11 వేల కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.10 వేల వరకు ఆదా అవుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టినా ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్‌ బంకులు, సోలార్‌ పవర్‌ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. శిల్పారామం పక్కన రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని కేటాయించి మహిళలకు ఉపాధి కల్పించామని, సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని వివరించారు. యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నామని పేర్కొన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకే మంత్రి, కీలక పదవులు దక్కాయని ఆరోపించారు. తన ప్రభుత్వంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలకు పదవులు దక్కాయని తెలిపారు. శంకర్‌నాయక్‌, అద్దంకి దయాకర్‌, సీపీఐ సత్యం తదితరులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణను బందిపోట్ల ముఠాల మాదిరిగా దోచుకున్నారని సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఓఆర్‌ఆర్‌ను అమ్ముకుని.. మింగి.. కుర్చీ నుంచి దిగిపోయారని ఆరోపించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్‌ తర్వాత ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చూశారని, తాము మాత్రం సర్దార్‌ పాపన్నతో పాటు ఇతర ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్‌ కార్డులు ఉండగా, 3.48 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సైతం సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రైతు రుణమాఫీ, రైతుభరోసా, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అందుతున్నాయా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా తిప్పికొట్టారు. కుటుంబ సభ్యులకు పదవులు దక్కడం లేదనే బాధతోనే వారు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌లపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పాలన పోవాలి.. దోపిడీ పాలన రావాలని కుట్రలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు