BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 09:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు: మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 09:45 PM
8 వీక్షణలు

గుంటూరులో మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన నిందితుడిని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తాడికొండ మండలం తాతిరెడ్డిపాలెంకు చెందిన గణేష్‌.. గుంటూరు కన్నావారితోటకు చెందిన మహిళను గత నెల 14న కత్తితో బెదిరించాడు. అనంతరం ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని లాం సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం బాధితురాలికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించి, వాటిని బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడించారు. తాను పిలిచినప్పుడల్లా రావాలని, లేదంటే వీడియోలను బహిర్గతం చేస్తానంటూ నిందితుడు ఆమెను వేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడి వేధింపులు భరించలేక బాధితురాలు నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ఇతర వివరాలను సేకరించి నిందితుడిని గుర్తించిన పోలీసులు గణేష్‌ను అరెస్ట్ చేశారు.

మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బాధితులు భయపడకుండా తమకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.