BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 09:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కార్పొరేట్, మతతత్వ, మనువాద శక్తులను ప్రతిఘటిద్దాం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 09:45 PM
2 వీక్షణలు

సమానత్వం–సౌభ్రాతృత్వం–ప్రజాస్వామ్యం వర్ధిల్లే ప్రజల ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిద్దాం

ఎంతో పోరాట చరిత్ర కలిగిన, లౌకిక భావాలతో వర్ధిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌ను మతతత్వ శక్తులకు అడ్డాగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాలని వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు పిలుపునిచ్చాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయని విమర్శించాయి.

175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి 164 స్థానాలను గెలుచుకోగా, తెలుగుదేశం 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలు సాధించాయి. వైఎస్సార్‌సీపీ 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష స్వరం బలహీనపడిందని, ఈ పరిస్థితుల్లో వామపక్షాలు, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నాయి.

కేంద్రం హామీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాలి

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిలదీయాలని కోరారు.

రాయలసీమకు ప్రకటించిన నిధులు, పోలవరం నిర్వాసితుల సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన ఇతర హక్కుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రం రాష్ట్రాల సమాఖ్య హక్కులను హరిస్తూ కేంద్రీకరణ వైపు వెళ్తోందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

జనసేనపై తీవ్ర విమర్శలు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విధానాలపై కూడా వామపక్ష శక్తులు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజా సమస్యలను పక్కన పెట్టి మతపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించాయి. తిరుపతి లడ్డూ వివాదం నుంచి వారాహి యాత్ర, హిందూ శంఖారావం వరకు సాగిన రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో మతతత్వ రాజకీయాలకు ఊతమిచ్చేలా ఉన్నాయని విమర్శించాయి.

కార్పొరేట్లకు రాష్ట్ర వనరులు అప్పగించొద్దు

అభివృద్ధి పేరుతో పచ్చని పంట పొలాలు, రైతుల భూములను పెద్ద కార్పొరేట్‌ సంస్థలు, బహుళజాతి సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం నుంచి తడ వరకు కార్గో విమానాశ్రయాలు, సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, ఇతర ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల భూములను సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరుపయోగంగా ఉన్న ప్రత్యేక ఆర్థిక మండలి భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని, బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్య, వైద్యం సహా ప్రజలకు సంబంధించిన కీలక రంగాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యమం

32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రకు కల్పవృక్షం వంటిదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, కార్మికుల ఉపాధిని కాపాడాలని డిమాండ్‌ చేశారు. కర్మాగారానికి అవసరమైన ముడి పదార్థాల వనరులు, గనుల కేటాయింపు విషయంలో కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించాలని కోరారు.

పేదరిక నిర్మూలన పేరుతో ప్రచారాలు వద్దు

పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ సంస్థల ఆధారంగా పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పడం ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రజల సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు.

కార్మికుల పని గంటల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిద్దాం

కార్మికుల పని గంటలను పెంచే ప్రతిపాదనలను కార్మిక వ్యతిరేక నిర్ణయాలుగా అభివర్ణించారు. పారిశ్రామిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కార్మికుల పని గంటలను పెంచడం సరికాదని, కార్మిక హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నికల హామీలు అమలు చేయాలి

ఎన్నికల సమయంలో తెలుగుదేశం ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అనేక హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.

20 లక్షల ఉద్యోగాల కల్పన, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడం వంటి హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు.

ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం

ప్రజల సమస్యలపై పీపుల్స్‌ సిక్స్‌ డిమాండ్స్‌తో లిబరేషన్‌ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోందని తెలిపారు. ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లకు మద్దతు ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదిత కార్గో విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని, నిరుపయోగంగా ఉన్న సెజ్‌ భూములను రైతులకు తిరిగి అప్పగించాలని, బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని ప్రజా ఉద్యమాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.

తృతీయ ప్రత్యామ్నాయ నిర్మాణానికి కృషి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వామపక్షాలు, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులతో ఐక్య సంఘటనను నిర్మించి రాష్ట్రంలో బలమైన తృతీయ ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.

సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలు వర్ధిల్లే ప్రజల ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం కోసం విస్తృత ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.