BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 25 June 2026, 02:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పుట్రేల మారెమ్మ తల్లి దేవస్థాన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 02:44 PM
124 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలోని మారెమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు అర్చకులు, దేవస్థాన అధికారులు, గ్రామ పెద్దలు, భక్తులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే, గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పునః ప్రతిష్ట మహోత్సవం గ్రామానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ తెర్ల శ్రీనివాసరావు, టీడీపీ విస్సన్నపేట మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు, యువ నాయకులు ఎన్‌ఆర్‌ఐ గిరి, జి.వి.ఆర్., కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.