BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 15 May 2026, 03:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పుట్టపర్తిలో భారీ రక్షణ ప్రాజెక్టులకు నేడు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:31 PM
132 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ రంగానికి కొత్త దిశగా భావిస్తున్న కీలక కార్యక్రమం నేడు పుట్టపర్తిలో జరగనుంది. మరికాసేపట్లో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఐదో తరం అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) తయారీ కేంద్రానికి శంకుస్థాపన కానుంది. ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు.

దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందనుంది. ఏఎంసీఏ ఇంటిగ్రేషన్ మరియు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్‌తో పాటు, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మరికొన్ని కీలక రక్షణ రంగ ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా శంకుస్థాపన జరగనుంది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననుండగా, రాష్ట్రంలో రక్షణ మరియు ఏరోస్పేస్ రంగాలకు ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడులతో పాటు యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.