BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 31 January 2026, 04:25 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ

తెలంగాణ
31 Jan, 2026 - 04:25 AM
383 వీక్షణలు
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద ఇంటింటికీ పంపిణీ NTODAY NEWS: ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యుడు సొంగా రోషన్ కుమార్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు, ఆదివారం ఒకటో తేదీ కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. తెల్లవారుజామునే చింతలపూడి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ, “చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు. ఒక రోజు ముందుగానే పింఛన్ అందించి ప్రతి ఇంట్లో చిరునవ్వు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని లబ్ధిదారులతో పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన పింఛన్లు అందిస్తున్నది కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చింతలపూడి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరవుతున్నాయని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నామని, గ్రామగ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మండల పార్టీ అధ్యక్షుడు కిలారి సత్యనారాయణ, గ్రామ టీడీపీ–కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. #NTRBharosa #PensionDistribution #Chintalapudi #EluruDistrict #AllianceGovernment #SocialSecurityPensions #DoorstepDelivery #PublicWelfare Follow us on Website Facebook Instagram YouTube